HomeతెలంగాణHyderabad | డ్రగ్స్​ దందాలో కానిస్టేబుల్​ అరెస్ట్​

Hyderabad | డ్రగ్స్​ దందాలో కానిస్టేబుల్​ అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | డ్రగ్స్​ దందాను అరికట్టాల్సిన ఓ కానిస్టేబుల్(Constable)​ డ్రగ్స్​ ముఠాతో చేతులు కలిపాడు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సదరు కానిస్టేబులే డ్రగ్స్​ దందా(Drug trafficking) చేపట్టడం గమనార్హం. డ్రగ్స్ దందా చేస్తున్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ పోలీస్​ కానిస్టేబుల్​ను హైదరాబాద్​ పోలీసులు(Hyderabad Police) అరెస్ట్​ చేశారు.

తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లాకు చెందిన దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ కలిసి డ్రగ్స్​ దందాకు తెరలేపారు.

నిందితులు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)కి డ్రగ్స్​ తీసుకొని వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వీరిపై దాడి చేసి సోమవారం అరెస్ట్​ చేశారు. అయితే మిగతా నిందితులు చిక్కగా.. కానిస్టేబుల్​ మాత్రం పరారయ్యాడు. తాజాగా ఆయనను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. పట్టుబడ్డ డ్రగ్స్​ విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.