HomeతెలంగాణHarish Rao | కాళేశ్వరం మోటార్లు నాశనం చేసే కుట్ర.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao | కాళేశ్వరం మోటార్లు నాశనం చేసే కుట్ర.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​ మోటార్లు నాశనం చేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం మోటార్లను రోజు ఆన్​ ఆఫ్​ చేస్తున్నారన్నారు. అంత పెద్ద మోటార్లు రోజు ఆన్​ ఆఫ్​ చేస్తే బేరింగ్​లు పాడవుతాయని చెప్పారు. అవి పాడైతే ఆ నెపం తమపై వేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.

కాళేశ్వరంలో ఉన్నవి భారీ మోటార్లని హరీశ్​ రావు తెలిపారు. ఒక జిల్లాకు అవసరం అయ్యే కరెంట్​ ఒక్క మోటార్​ రన్​ చేయడానికి అవసరం అన్నారు. అలాంటి మోటార్లను ఆన్‌ చేసి ఆఫ్‌ చేస్తే దెబ్బతింటాయన్నారు. అలా చేయకూడదని ఇంజినీరింగ్​ అధికారులు, బీహెచ్​ఈఎల్​ చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. రోజు ఉదయం 7 గంటలకు మోటార్లు స్టార్ట్​ చేసి, సాయంత్రం 5 గంటలకు బంద్​ చేస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం కరెంట్ డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో ఇలా చేస్తున్నారని చెప్పారు. అయితే ఆన్​ అండ్​ ఆఫ్​ చేస్తే మోటార్లు పనికి రాకుండా పోతాయన్నారు. ఈ మేరకు మోటార్లు సరఫరా చేసిన బీహెచ్​ఈఎల్ (BHEL) కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిందన్నారు.

Harish Rao | ప్రాజెక్ట్​లపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని హరీష్​ రావు అన్నారు. రిజర్వాయర్లపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కి లేఖ రాసినట్లు చెప్పారు. సాగునీటిని సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌ (BRS)పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లను ఆన్​ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు.

కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి నీటి విలువ తెలియదన్నారు. ఎస్సారెస్పీ(SRSP)కి భారీగా ఇన్​ఫ్లో వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీరు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. వరద కాలువ ద్వారా మిడ్​మానేరును నింపాలని డిమాండ్​ చేశారు.

Must Read
Related News