ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pavan Kalyan | ‘ఓటు చోరీ’ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. పవన్​ కల్యాణ్​​...

    Pavan Kalyan | ‘ఓటు చోరీ’ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. పవన్​ కల్యాణ్​​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఓటు చోరీ (Vote Chori) ఆరోపణల వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర  దినోత్సవంలో భాగంగా కాకినాడలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఓటు చోరీ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈసీ ఓటు చోరీకి పాల్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్​ జగన్​ (YS Jagan) సైతం ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో పవన్​ కల్యాణ్​ స్పందించారు.

    Pavan Kalyan | గెలిచినప్పుడు ఒకలా..

    పలు పార్టీలు ఎన్నికల్లో గెలిచినప్పుడు చప్పుడు చేయడం లేదు. ఓడగానే ఈవీఎం (EVM)ల ట్యాపంరింగ్​, ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పవన్​ మాట్లాడుతూ గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా అని ప్రశ్నించారు. వోట్ చోరీ అనే అంశం అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలన్నారు. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోవడంతో, ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

    Pavan Kalyan | మహిళలకు ప్రాధాన్యత

    కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ (Super Six) హామీలు అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆయా పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ (YCP) పాలనను ఆయన చీకటి సమయంగా వర్ణించారు. తాము స్వాతంత్ర్య సమరయోధుల పూర్తితో పాలిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు జరిగేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు. సుస్థిరత ఉండాలంటే తమ ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలన్నారు. కాకినాడ నుంచి డీజిల్​ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. తీర ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్​ కల్యాణ్ సూచించారు.

    Latest articles

    Redmi 15 | రెడ్‌మీ నుంచి mAhA బ్యాటరీ ఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Redmi 15 | చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ(Redmi).....

    Nizamabad | అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి: నిరంజన్​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | సమగ్రాభివృద్ధితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని...

    FASTag | వార్షిక టోల్ పాస్‌తో ఏటా రూ.7 వేల దాకా ఆదా.. అమ‌లులోకి వ‌చ్చిన ఫాస్టాగ్ యాన్యువ‌ల్ ప్లాన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: FASTag | జాతీయ ర‌హ‌దారుల‌పై త‌ర‌చూ ప్ర‌యాణం చేసే వాహ‌న‌దారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ...

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB)లో సెక్యూరిటీ...

    More like this