అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ hyderabadలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్(pahalgam)లో ఉగ్రవాడులు దాడులు చేసి 26 మందిని చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిఘా వర్గాలు Intelligence agencies అప్రమత్తం అయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని పేర్కొన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు telangana police అప్రమత్తమై ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేసింది.
Hyderabad | ఐసిస్ పన్నాగం.. భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ఐసిస్ (isis) కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని పథకం పన్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ కలిసి పేలుళ్లు జరపాలని ప్లాన్ వేశారు.
ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. సిరాజ్, సమీర్‌లకు సౌదీ నుంచి ఐసిస్ ఆదేశాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.