ePaper
More
    HomeజాతీయంTamil Nadu | తమిళనాడు గూడ్స్​ రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం?

    Tamil Nadu | తమిళనాడు గూడ్స్​ రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడులో ఇంధనం​ లోడ్​తో వెళ్తున్న గూడ్స్​ రైలు (goods train) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

    కాగా.. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలో రైలు పట్టాలు విరిగి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. రైల్వే అధికారులు (Railway officials), పోలీసులు విచారణ చేపడుతున్నారు.

    తమిళనాడులో (Tamil Nadu) ఆదివారం తెల్లవారుజామున ఇంధనం​ లోడ్​తో వెళ్తున్న గూడ్స్​ రైలులో (Goods Train) ఒక్కసారిగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు సమీపంలో రైలు పట్టాలు తప్పటంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఐదు వ్యాగన్లకు వ్యాపించాయి. ఈ రైలులో మొత్తం 52 వ్యాగన్లు ఉండగా.. 5 వ్యాగన్లు కాలిబూడిద అయిపోయాయి. మిగిలిన వ్యాగన్లను అధికారులు సురక్షితంగా తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

    Tamil Nadu | కొనసాగుతున్న సహాయక చర్యలు

    చెన్నై ఓడరేవు (Chennai port) నుంచి ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కో వ్యాగన్​లో 70 వేల లీటర్ల ఆయిల్​ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది. మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు సహాయక చర్యలు ఇంకా చేపడుతున్నారు.

    ఆ ప్రాంతంలో ట్రాక్​ పునరుద్ధరించడంతో పాటు వ్యాగన్ల శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు మంటలకు విద్యుత్​ లైన్లు తెగిపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. అయితే ప్రమాద స్థలం నుంచి వంద మీటర్ల దూరంలో ట్రాక్​ విరిగి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...