అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెయూ పరిధిలో దోస్త్(DOST) ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించనున్నట్లు దోస్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీలైన పీహెచ్సీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ తదితర కేటగిరీల విద్యార్థులు ఈనెల 9న తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో తెయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రెండు సెట్ల జిరాక్స్ సెట్లు సైతం వెంట తీసుకురావాలని సూచించారు.
