అక్షరటుడే, పెద్ద కొడప్గల్: Pedda Kodapgal | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Former MLA Hanmanth Shinde) పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెద్దకొడప్గల్ మండలంలో (Pedda Kodapgal mandal) శనివారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పర్యటించారు.
బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకుందాం..
పెద్దకొడప్గల్ మండలంలోని వడ్లం, కాస్లాబాద్, బేగంపూర్ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో (BRS party) చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ తరపున బలపర్చిన సర్పంచ్, వార్డుమెంబర్లను గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు లొంగవద్దన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించకపోతే ప్రభుత్వ పథకాలు అమలు కావని చెబుతున్నారని.. ఇలా చెబితే భయపడేవారు ఎవరూ లేరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, నాయకులు సతీష్, సంజీవ్ పటేల్, బుసప్పా పటేల్, సుధీర్, నందు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.