అక్షరటుడే, భీమ్‌గల్: Mla Prashanth Reddy | కాంగ్రెస్ నయవంచక పాలనను ఎండగట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు.
వేల్పూర్ మండల (Velpur mandal) కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్వహించిన మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎనినకలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రజలకు బాకీ ఉన్న హామీలను ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Mla Prashanth Reddy | కేటీఆర్ పిలుపు మేరకు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపు మేరకు కాంగ్రెస్ నయవంచక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని తీసుకొచ్చామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో (Balkonda constituency) ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి.. గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
Mla Prashanth Reddy | అడ్డగోలు హామీలు ఇచ్చి..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దె నెక్కిందని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కాలేదlhleki.
Mla Prashanth Reddy | బీజేపీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీకి ఓటు వేస్తే మురిగిపోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డితో ప్రజల పక్షాన నీలదీసి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు.
22 నెలలుగా రూ.2,500 చొప్పున రూ. 55,000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడిందన్నారు. వృద్దులకు, బీడీ పెన్షన్ (beedi pension) వాళ్లకు అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన రూ.2,000 మాత్రమే ఇస్తున్నారని, 22 నెలలుగా వృద్ధులకు బీడీ పెన్షన్ దారులకు కాంగ్రెస్ రూ.44,000 బాకీ పడిందన్నారు. ఇలా ప్రతి హామీలోనూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.
ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఎంత బాకీ పడిందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డులను పంచుతామని ఎమ్మెల్యే చెప్పారు. పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, వివరిస్తూ అవగాహన కల్పించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.