HomeతెలంగాణCM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలి.. సీఎం కీలక...

CM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.

కొందరు దుబాయ్‌లో ఆఫీసులు పెట్టి, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రభుత్వానికి బ్రాండ్​ అంబాసిడర్లుగా మారాలని కోరారు. సోషల్​ మీడియాలో యుద్ధం (social media war) ప్రకటించాలని.. ఆ యుద్ధంలో కల్వకుంట్ల గడీ ముక్కలుముక్కలు కావాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

CM Revanth Reddy | 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం

తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు (government jobs) ఇచ్చామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్‌.. దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 60 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా.. తాను క్షమాపణ చెబుతానన్నారు.

CM Revanth Reddy | రైతురాజ్యంపై చర్చ పెడదాం

రైతురాజ్యంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చపెడదామని ప్రధాని మోదీ (Prime Minister Modi), మాజీ సీఎం కేసీఆర్​కు సవాల్​ విసిరారు. ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. రైతు భరోసా విఫలమవుతుందని.. కొందరు గోతికాడ నక్కల్లా ఎదురు చూశారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వివరించారు.

CM Revanth Reddy | ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి 119 ఎమ్మెల్యే సీట్లు 153కు పెరుగుతాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో (Women Reservation Bill) 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.