అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం (Congress candidate Naveen Yadav won) సాధించారు. పది రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆఖరి రౌండ్‌లో సైతం హస్తం పార్టీ ఆధిక్యం సాధించింది.
రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills election) కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించాయి. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఇతర నేతలు సైతం జోరుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, గోపినాథ్ మృతితో సానుభూతి కలిసి వచ్చి తాము గెలుస్తామని బీఆర్ఎస్ భావించింది. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. నవీన్ యాదవ్ గెలుపుపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది.
Jubilee Hills counting | భారీ మెజారిటీతో..
పదో రౌండ్ కౌంటింగ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై (BRS candidate Sunitha) నవీన్‌యాదవ్ విజయం సాధించారు. రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉంటుందని, పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా కౌంటింగ్‌లో భాగంగా.. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. అన్ని రౌండ్లలో ఆ పార్టీ అభ్యర్థి లీడ్ సాధించారు. ఒక్కసారి కూడా మాగంటి సునీత పోటీలోకి రాకపోవడం గమనార్హం.
Jubilee Hills counting | ఆధిక్యం వివరాలు
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,947, మూడో రౌండ్‌లో 2,843 ఓట్ల లీడ్ సాధించింది. నాలుగో రౌండ్‌లో 3,558, ఐదో రౌండ్‌లో 3,178, ఆరో రౌండ్‌లో 2,938, ఏడో రౌండ్‌లో 4,030, ఎనిమిదో రౌండ్‌లో 1,876, తొమ్మిదో రౌండ్‌లో 2,117 ఓట్ల ఆధిక్యం సాధించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి (BJP candidate Deepak Reddy) డిపాజిట్ కోల్పోయారు. ఈ గెలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సాయంత్రం నాలుగు గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
