అక్షరటుడే, వెబ్‌డెస్క్: Thorruur Municipality | మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) తొర్రూర్ మున్సిపాలిటీలో శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు.
తొర్రూర్ మున్సిపాలిటీని (Thorrur municipality) దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్దిదారులు ఉత్సాహంగా ప్రచారానికి వస్తున్నారని చెప్పారు. అంతకుముందు ఆయన ఏదులాపురంలో మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. ఏదులాపురంలో కాంగ్రెస్ అన్ని వార్డులు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Thorruur Municipality | అభివృద్ధి పనులు
ఏదులాపురంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రూ.680 కోట్లతో చేపట్టిన మున్నేరు రక్షణ గోడ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామన్నారు. మున్నేరు పక్కన 3 ఘాట్లు ఏర్పాటు, ఎఫ్.సి.ఐ గోడౌన్ తరలింపుతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు నడుస్తుందన్నారు. ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు ప్రజల ముందుకు వచ్చి మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.