అక్షరటుడే, కామారెడ్డి: Congress Warning to Rakesh | ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
Congress Warning to Rakesh | గూండాలా..
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గూండాలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అమ్మి పైకి వచ్చిన వాళ్లం కాదని, నిఖార్సైన కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్లమని పేర్కొన్నారు. తమ నాయకుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) సూచన మేరకే మౌనంగా ఉంటున్నామని, తమకు కూడా మాట్లాడే దమ్ము, సత్తా ఉందన్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చిన వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడని, ఎమ్మెల్యే సూపర్ అంటూ మెసేజీలు చేసినట్టు ఆ పార్టీ కౌన్సిలర్ చెప్పారని గుర్తు చేశారు. వాళ్లే ఇదంతా కావాలని చేసారేమోనన్నారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందని, ఆయన దాడి చేయగలడా అని ప్రశ్నించారు.
ఉనికి కోల్పోతున్న ఎమ్మెల్యే కేవీఆర్..
జిల్లాలో ఎమ్మెల్యే వెంట రమణారెడ్డి (Kamareddy News) తన ఉనికిని కోల్పోతున్నానని, తప్పు రుజువైతే రాజీనామా చేయాల్సి వస్తుందని భయంతో రాష్ట్ర నేతలను పిలిపించుకుని రచ్చ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం కాలి గోటికి కూడా సరిపోడన్నారు. రోహింగ్యాలపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తామని, దమ్ముంటే దానిపై సీబీఐ విచారణ జరిపి నిరూపించాలని సవాల్ చేశారు.
ఇద్దరు సీఎంలను ఓడించిన గొప్ప వ్యక్తిని అని చెప్పుకొనే ఎమ్మెల్యేకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. ఇకనైనా ఇలాంటి మాటలు మానుకుని వివాదాలకు ముగింపు పలికి అభివృద్ధిలో తమ నాయకునితో కలిసి రావాలన్నారు. కక్ష సాధింపులతో ఒరిగేది ఏమి లేదని, కామారెడ్డి అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ పాల్గొన్నారు.
