అక్షరటుడే, ఇందూరు: BC Teachers Association | ఉపాధ్యాయులకు ఇటీవల పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని నుడా(NUDA) ఛైర్మన్ కేశవేణు(Kesha Venu) అన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా (Gazetted Headmasters) పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసిందని గుర్తు చేశారు. అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు కూడా దశలవారీగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు.
పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరికీ కేశవేణు అభినందనలు తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు.
కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడు మోహన్, గౌరవాధ్యక్షుడు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రవికుమార్, రామకృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, రమేష్, సత్యనారాయణ, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, రామకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.