అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | గ్రామాల్లో అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. ఈ మేరకు ఎల్లారెడ్డి నియోజక వర్గంలో (Yellareddy Constituency) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
MLA Madan Mohan | గత పాలకులు అశ్రద్ధ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపించలేదని, గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కూడా అందించలేకపోయారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల (Welfare Schemes) గురించి ప్రజలకు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House), గృహలక్మి, మహిళా రుణాలు, ఉచిత బస్ లాంటి పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపర్చిన వ్యక్తులకు పట్టం కట్టాలని కోరారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.