అక్షరటుడే, ఆర్మూర్: Armoor Congress | స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెల్చుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి (Podduturi Vinay Reddy) అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశo నిర్వహించారు. ఎంపీటీసీ స్థానాలకు (MPTC seat) ముగ్గురు చొప్పున పేర్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
Armoor Congress | గెలిచి వారికి ప్రాధాన్యత..
గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తామని వినయ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి ప్రకాష్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర విజయ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, డొంకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ ఇస్సపల్లి జీవన్, పవన్ పండిట్, వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాక్లూర్ సొసైటీ ఛైర్మన్ అశోక్, లిఫ్ట్ ఛైర్మన్ భోజారెడ్డి, జితేందర్ రెడ్డి, మారుతీ రెడ్డి, పీర్ సింగ్, మాక్లూర్ యూత్ అధ్యక్షుడు వినోద్, గంగాధర్ గౌడ్, గంగారెడ్డి, సాయినాథ్ గౌడ్, యాళ్ల సాయి రెడ్డి, చుక్క శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.