అక్షరటుడే, ఆర్మూర్: Aloor mandal | స్థానిక సంస్థల ఎన్నికల్లో ( local body elections) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ కార్యదర్శి డేగ పోశెట్టి పేర్కొన్నారు. ఆలూర్ మండలం (Aloor mandal) కల్లెడ గ్రామంలో మంగళవారం లోకల్‌బాడీ ఎలక్షన్ల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లెడలో ఎంపీటీసీ, సర్పంచ్ (MPTC and Sarpanch) పదవుల అభ్యర్థులు, ఆశావహుల జాబితాను పీసీసీకి పంపించామని.. త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నీలగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, ఆలూరు మండల యూత్ ప్రెసిడెంట్ సిరికొండ మహేష్, ధర్మయ్య అశోక్, హబీబ్, నర్సారెడ్డి, శ్రీను గంగారాం, భాస్కర్, బాలరాజు, శివ కృష్ణ, రాజశేఖర్, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.