HomeతెలంగాణCongress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

Congress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్​లో నిర్వహించారు. ఛైర్మన్​ మల్లు రవి అధ్యక్షతన పెండింగ్​ వివాదాలపై చర్చించారు.

వరంగల్​ కాంగ్రెస్​ (Warangal Congress)లో విభేదాలు మళ్లీ రాజుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వరంగల్​లో మంత్రి కొండా సురేఖకు మిగతా ఎమ్మెల్యేలకు పాడటం లేదు. వర్గపోరు నేపథ్యంలో గతంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. అనంతరం వివాదాల పరిష్కారానికి కమిటీ వేసింది. తాజాగా మరోసారి వరంగల్​ రాజకీయాలపై కమిటీలో చర్చించారు.

Congress | ఫిర్యాదు అందలేదు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి (Rajagopal Reddy) కొంతకాలంగా కాంగ్రెస్​ పార్టీ, సీఎం రేవంత్​రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో సీఎం లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా క్రమ శిక్షణ కమిటీ సమావేశంలో ఆయన గురించి చర్చించలేదని ఛైర్మన్​ మల్లు రవి తెలిపారు. రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు రాలేదని, పీసీసీ కూడా చెప్పకపోవడంతో చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే గతంలోనే ఆయన వ్యవహారంపై చర్చించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ క్రమశిక్షణ కమిటీకి సూచించారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోవడానికి పార్టీ ఆలోచిస్తుండటం గమనార్హం.

Congress | సంయమనం పాటించాలి

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయని మల్లు రవి తెలిపారు. నేతలు అంతా సంయమనం పాటించాలని సూచించారు. విబేధాలను పక్కన పెట్టి అందరు కలిసి పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.

Congress | వివరణ ఇచ్చిన నర్సారెడ్డి

క్రమశిక్షణ కమిటీతో సిద్దిపేట​ (Siddipet) కాంగ్రెస్​ అధ్యక్షుడు నర్సారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల గజ్వేల్​లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్​ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నర్సారెడ్డిపై పలువురు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ నోటీసులు అందించింది. ఈ మేరకు ఆయన ఆదివారం వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని నర్సారెడ్డి తెలిపారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Must Read
Related News