Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Congress | 'ఓట్ చోరీ'పై నగరంలో కాంగ్రెస్ నిరసన

Nizamabad Congress | ‘ఓట్ చోరీ’పై నగరంలో కాంగ్రెస్ నిరసన

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP government) దేశంలో ‘ఓట్ చోరీ’కి పాల్పడిందని ఆరోపిస్తూ జిల్లా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే మోదీ దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేశంలో మోదీ సర్కారు ఓటు బ్యాంక్​ చోరీకి పాల్పడి అధికారంలోకి వచ్చారని వారు విమర్శలు గుప్పించారు.

Nizamabad Congress | దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారు..

సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (DCC President Mohan Reddy) మాట్లాడుతూ దొంగఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నగర అధ్యక్షుడు కేశ వేణు (Kesha Venu), పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, విపుల్ గౌడ్, వేణు రాజ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు, కాంగ్రెస్​ నాయకుల మధ్య వాగ్వాదం