ePaper
More
    Homeజిల్లాలువరంగల్​Warangal Congress | ఉత్కంఠగా వరంగల్​ కాంగ్రెస్​ రాజకీయాలు.. వారిపై చర్యలుంటాయా..?

    Warangal Congress | ఉత్కంఠగా వరంగల్​ కాంగ్రెస్​ రాజకీయాలు.. వారిపై చర్యలుంటాయా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress | వరంగల్​ కాంగ్రెస్​లో గ్రూప్​ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) దంపతులకు, మిగతా ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఇటీవల కొండా మురళి (Konda Murali), కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నారు.

    ఈ క్రమంలో ఇప్పటికే కొండా మురళి పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మంత్రి పొంగులేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)​తో కూడా సమావేశం అయ్యారు. అయితే కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని మిగతా ఎమ్మెల్యేలు డిమాండ్​ చేస్తున్నారు.

    Warangal Congress | తాడో పేడో తేల్చాలి

    స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డిపై ఇటీవల కొండా దంపతులు వ్యాఖ్యలు చేశారు. వారి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. అంతేగాకుండా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆదివారంలోపు తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు డెడ్​లైన్​ పెట్టారు. అయితే సోమవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా వ్యతిరేక వర్గంతో సమావేశం కానుంది. వారితో సమావేశం అనంతరం కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనే ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనుంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    Warangal Congress | చిచ్చురేపిన కొండా సుష్మిత ట్వీట్

    ఇప్పటికే రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో కొండా దంపతుల కుమార్తె సుష్మిత పటేల్ (Susmitha Patel)​ ట్వీట్​ చిచ్చు రేపింది. తాను భవిష్యత్​లో పరకాల (Parakal) నుంచి పోటీ చేస్తాననేలా ఆమె సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ఇటీవల కొండా మురళి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ కొండా సురేఖ తమ కూతురిలో రాజకీయ రక్తం ప్రవహిస్తోందన్నారు. ఆమె పరకాల నుంచి పోటీ చేయాలనుకుంటే ఆమె నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం తమకు లేదన్నారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఉన్నారు. ఇటీవల కొండా మురళి రేవూరి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఆయన తమ కాళ్లు పట్టుకోవడంతో.. గెలిపించామన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్​ కాంగ్రెస్​లో పోరు పార్టీ నష్టం చేసే అవకాశం ఉందని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...