అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DCC Nizamabad | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తప్పక నెరవేరుస్తుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
DCC Nizamabad | గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు..
కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్ల నమ్మకం ఉంచి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకముందనే విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని ఆయన వెల్లడించారు.
DCC Nizamabad | ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ప్రజాపాలనను గమనిస్తున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) తమకు అనుకూలంగా తీర్పునిచ్చాయని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇల్లులేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు అందిస్తున్నామని వివరించారు.
DCC Nizamabad | గత బీఆర్ఎస్ హయాంలో..
గతంలో బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల కోసం రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతు భరోసా పేరుతో ఎకరానికి ఏడాదికి రూ.12 వేల అందిస్తున్నామన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నందునే ప్రజలు తమవైపు నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా, అబ్దుల్ ఎజాజ్, సాయికిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.