అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (Yellareddy MLA Madan Mohan) పేర్కొన్నారు. దసరా (Dussehra) సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉషా గౌడ్, ప్యాక్స్ డైరెక్టర్ గోపి, ప్యాక్స్ వైస్ ఛైర్మన్ పద్మారావు, మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, మత్తమాల అధ్యక్షుడు సల్మాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.