అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌దే కీలక పాత్ర అని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy) పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Congress party foundation day) వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు.
Nizamabad Congress | బ్రిటీష్ ఆసియాలో విస్తరించిన సమయంలో..
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ 1885లో డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిందన్నారు. 1920 నుండి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం జరిగిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించిందని తెలిపారు. గాంధీ, అంబేడ్కర్ కాంగ్రెస్ పార్టీలో (Congress party) ఉండి దేశ స్వాతంత్య్ర కోసం పోరాడిన నాయకులని పేర్కొన్నారు. నేడు భారతదేశం అంతరిక్షానికి రాకెట్ ప్రయోగాలు చేస్తుందంటే.. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక వల్లనేనని ఆయన వెల్లడించారు. కానీ దేశ స్వాతంత్య్ర సమయంలో ఉనికిలోనే లేని బీజేపీ దేశాన్ని తామే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ విపుల్ గౌడ్, వేణు రాజ్, నరాల రత్నాకర్, లింగం, రాజా నరేందర్ గౌడ్, శ్రీనివాస్, మీసాల సుధాకర్, వినయ్, మొయిన్, కేశ మహేష్, ఈసా, ఎజాజ్, సుభాష్ జాదవ్, కుద్దుస్, బలరాం, శివ, సంగెం సాయిలు, శ్రీశైలం, మాజీ మేయర్ సుజాత, పోల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, మీనా, బాల నర్సయ్య, పురుషోత్తం, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.