అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : DCC Nizamabad | నేషనల్ హెరాల్డ్ కేసుకు (National Herald Case) సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలను వేధిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాల ముట్టడి చేపట్టింది.
ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయాన్ని (BJP Party Office) ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు గురువారం ‘బీజేపీ కార్యక్రమం ముట్టడి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy), నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికి మధ్యలోనే అడ్డుకున్నారు.
DCC Nizamabad | పోలీస్‌స్టేషన్‌కు తరలింపు..
బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నగేష్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు (One Town Police Station) తరలించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను తప్పుబట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీసేందుకు తాము ముట్టడి కార్యక్రమం చేపట్టామన్నారు. పోలీసులు ప్రత్యేక దళాలతో కాంగ్రెస్ నాయకులను బీజేపీ కార్యాలయానికి వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


