అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖాయం అయిపోయింది. ఆది నుంచి హస్తం పార్టీ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం 9 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 2,117 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో (Kotla Vijaya Bhaskar Reddy Stadium) కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. అయితే పోరు హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress and BRS) మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. అయితే తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. తొలి రౌండ్‌లో నువ్వా నేనా అన్నట్లు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ మాత్రమే సాధించింది. అయితే అనంతరం అన్ని రౌండ్లలో కాంగ్రెస్ దూసుకు వెళ్తొంది. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తొమ్మిదో రౌండ్‌లో 2,117 ఆధిక్యం రాగా.. మొత్తం 23,612 ఓట్ల లీడ్‌లో నవీన్ యాదవ్ ఉన్నారు.
Jubilee Hills counting | ఆధిక్యం వివరాలు
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ 50,849, బీఆర్ఎస్ 37,990, బీజేపీ 8,569 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్ ముగిసే సరికి నవీన్ యాదవ్ 60,402 ఓట్లు, సునీత 44,605, దీపక్‌రెడ్డి 10,235 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,947, మూడో రౌండ్‌లో 2,843 ఓట్ల లీడ్ సాధించింది. నాలుగో రౌండ్‌లో 3,558, ఐదో రౌండ్‌లో 3,178, ఆరో రౌండ్‌లో 2,938, ఏడో రౌండ్‌లో 4,030, ఎనిమిదో రౌండ్‌లో 1,876 ఓట్ల ఆధిక్యంతో దూసుకు పోతుంది.
Jubilee Hills counting | ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ (PCC President Mahesh Goud) మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారన్నారు. అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వంద స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
