అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను (pending projects) పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) కృష్ణా జలాలపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ అన్నారు. నల్గొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
Harish Rao | కాళేశ్వరంపై కక్ష
లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ కక్ష కట్టిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడకుండా రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6. 64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చామని వెల్లడించారు. తొలి నుంచి కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో పెట్టకుండా ద్రోహం చేసిందని ఆరోపించారు.