Congress MP | కాంగ్రెస్ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. తిప్పికొట్టిన బీజేపీ నాయ‌కులు
Congress MP | కాంగ్రెస్ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. తిప్పికొట్టిన బీజేపీ నాయ‌కులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress MP | ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి Pahalgam terror attack త‌ర్వాత దేశంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో కాంగ్రెస్ వైఖ‌రి త‌ర‌చూ వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. సున్నిత‌మైన ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని అధిష్టానం high command ఆదేశించినా ఆ పార్టీ నేత‌లు గీత దాడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ Congress MP Charanjit Singh Channi చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. 2019 పుల్వామా ఉగ్రవాద దాడి Pulwama terror attack తర్వాత పాకిస్తాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ surgical strikes విశ్వసనీయతను ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్సే surgical strikes జ‌ర‌గ‌లేద‌ని, భార‌త్ దాడి చేస్తే రుజువులు చూపాల‌ని అడిగారు. ఎప్పుడు, ఎక్క‌డ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేశారు. ఆ స‌మ‌యంలో ఎంత మంది చ‌నిపోయారు. వంటి వివ‌రాలు చెప్పాల‌ని ఎన్నిసార్లు అడిగినా చెప్ప‌డం లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

Congress MP | ఆధారాలేవి?

పాకిస్తాన్‌లో Pakistan ఎక్క‌డ దాడి చేశారన్న స‌మాచారం ఇప్ప‌టికీ తెలియ‌డం లేద‌న్నారు. మ‌రోవైపు, పాకిస్తాన్ కూడా దాడి attack జ‌ర‌గ‌లేద‌ని చెబుతోంద‌ని తెలిపారు. “మన దేశంలో బాంబు వేస్తే మనం కనుక్కోలేమా? ఎక్కడా సర్జికల్ స్ట్రైక్ surgical strike కనిపించలేదు. ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగిందో ఎవరికీ తెలియదు.. ఆధారాలు అడిగితే ఇవ్వ‌రు. ఇప్పుడు ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. వారి గాయాలకు చికిత్స చేయాలి. ఉగ్ర‌వాదుల‌ను తీవ్రంగా శిక్షించాలి.” అని చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ Charanjit Singh వ్యాఖ్యానించారు. పాకిస్తానీయుల వీసాలను Pakistani visas రద్దు చేయడం, సింధు జలాల Indus Water ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలకు అర్థం లేదన్నారు.

Congress MP | పాకిస్తాన్ వెళ్లి చూడాల‌న్న బీజేపీ..

కాంగ్రెస్ ఎంపీ Congress MP వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తిప్పికొట్టింది. 2024లో పూంచ్ దాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించినప్పుడు కూడా ఆయ‌న ఇలాగే “స్టంట్ బాజీ” “stunt baji” అని అసహ్యంగా వ్యాఖ్యానించారని గుర్తు చేసింది. “ఇప్పుడు అతను మళ్లీ సాయుధ దళాలను అవమానిస్తున్నాడు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ surgical strike చేశామని భార‌త సైన్యం Indian Army చెప్పిందని” బీజేపీ ప్రతినిధి కేశవన్ అన్నారు. మరో బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా BJP leader Manjinder Singh Sirsa కూడా చ‌న్నీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

చన్నీ, కాంగ్రెస్ Congress సాయుధ దళాల armed forces విశ్వ‌సనీయ‌త‌ను ప్రశ్నిస్తున్నారని విమ‌ర్శించారు. “కాంగ్రెస్ పార్టీ congress party సైన్యం, వైమానిక దళాన్ని మళ్లీ ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ surgical strike జరిగిందని తాను నమ్మడం లేదని, తనకు రుజువు కావాలని చరణ్‌జిత్ సింగ్ చన్నీ Charanjit Singh Channi అంటున్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో తెలియ‌జేస్తోంది. పాకిస్తాన్ Pakistan స్వయంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెప్పినా వీరికి అర్థం కావ‌ట్లేద‌ని” ఆయన అన్నారు. “మీకు ఇంత రుజువులు కావాలంటే రాహుల్ గాంధీతో Rahul Gandhi పాకిస్తాన్‌ను Pakistan సందర్శించి సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి” అని సిర్సా ఎద్దేవా చేశారు.

బీజేపీ BJP ఎదురుదాడితో చ‌న్నీ వెన‌క్కి త‌గ్గారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు surgical strike ఎటువంటి రుజువు చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి congress party governament అండగా నిలుస్తుందన్నారు.