అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Minority Wing | కాంగ్రెస్ మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ (State Congress Party Minority Cell) అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అన్నారు. పార్టీ మైనారిటీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను నియమించిన సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఘనంగా సన్మానించారు.
Congress Minority Wing | బాధ్యతగా భావించి..
అరంతరం ఇర్ఫాన్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తనకు గురుతర బాధ్యతను అప్పజెప్పిందన్నారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. పార్టీ మైనారిటీ విభాగాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తామన్నారు. తనను రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి(DCC President Nagesh Reddy), నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఇర్ఫాన్ అలీని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, అబుద్ బిన్ హందాన్, ప్రీతం, ముస్తఫా, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.