Homeతాజావార్తలుJubilee Hills counting | మూడో రౌండ్​లోనూ కాంగ్రెస్​ ఆధిక్యం

Jubilee Hills counting | మూడో రౌండ్​లోనూ కాంగ్రెస్​ ఆధిక్యం

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్​లో కాంగ్రెస్​​ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం అయింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్​లో కాంగ్రెస్​​ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం అయింది. మొదటి రెండు​ రౌండ్లలో షేక్​ పేట డివిజన్​ (Sheikh Peta division) ఓట్లు లెక్కించారు.

మూడో రౌండ్​లో నవీన్​ యాదవ్​ (Naveen Yadav) 3,100 ఓట్ల ఆధిక్యం సాధించారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్​ 6,047 ఓట్ల ఆధిక్యం ఉంది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను (postal ballot votes) లెక్కించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం కనబరిచింది. బ్యాలెట్ మొత్తం 101 ఓట్లు పోల్​ కాగా.. బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్​ ఓట్లు సాధించాయి.

తొలి రౌండ్​లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ 8,911, బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. తొలి రౌండ్​లో నవీన్​ యాదవ్​ ​47 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్​లో కాంగ్రెస్​కు 9,691, బీఆర్​ఎస్​కు 8,609 ఓట్లు పోల్​ అయ్యాయి. రెండో రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్​కు 17,874, బీఆర్​ఎస్​కు 14,879 ఓట్లు పోల్​ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి 3,475 ఓట్లు సాధించారు. రెండు రౌండ్లు ముగిసే సరికి నవీన్​ యాదవ్​ 2,945 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఇప్పటి వరకు షేక్​పేట, రహ్మత్​నగర్​, ఎర్రగడ్డ డివిజన్లలో కౌంటింగ్​ పూర్తయింది. నాలుగో రౌండ్​ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Must Read
Related News