అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (postal ballot votes) లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం కనబరిచింది. బ్యాలెట్ మొత్తం 101 ఓట్లు పోలు కాగా.. బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి.
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో అధికారులు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 8,926 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు (Maganti Sunitha) 8,864 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ 62 ఓట్ల అధిక్యంలో ఉంది. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉండటంతో రెండు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
