Homeజిల్లాలునిజామాబాద్​Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) మాట్లాడితే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు మనాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), సునీల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగధర్ అన్నారు. వేల్పూర్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.

యూరియా కొరత (urea shortage) లేకుంటే రైతులందరూ ఒక్క సంచి కోసం రోడ్లమీద ఎందుకు నిలబడుతున్నారని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ యూరియా సరఫరా చేసినట్లు సునీల్​రెడ్డి అంటున్నారని, రైతులు ఎందుకు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత ఇలాగే ఇంకో వారం రోజులు ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం సరికాదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News