అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Nizamabad | ఎంతో మంది గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని (employment guarantee scheme) తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. దీంట్లో భాగంగానే పథకానికి గాంధీ పేరు తొలగించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం గాంధీ చౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం (Mahatma Gandhi statue) వద్ద నిరసన తెలిపారు.
Congress Nizamabad | ఏఐసీసీ పిలుపు మేరకు..
ఏఐసీసీ పిలుపు, పీసీపీ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి ముందుగా పూలమాల వేశారు. అనంతరం అక్కడే టెంట్ వేసుకుని కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని మొత్తంగా తొలగించాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ పథకం ఎందరికో ఉపాధినిస్తోందని.. అలాంటి పథకాన్ని తొలగిస్తే దేశంలోని అనేకమంది పేద మహిళలకు పొట్టకొట్టిన వారవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.