అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (D Srinivas) వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. కంఠేశ్వర్ బైపాస్‌లో (Kanteshwar Bypass) డీఎస్ విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి (Mla Sudharshan reddy), భూపతిరెడ్డి (Mla Bhupathi reddy) తదితరులు నివాళులర్పించారు.
Nizamabad Congress | జిల్లా అభివృద్ధికి విశేష కృషి..
అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. డీఎస్ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్‌కు ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడ్డాడని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కేశ వేణు, సీనియర్ నాయకులు అంతిరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.