అక్షరటుడే, కోటగిరి : Congress Leaders Party Betrayal | ఎన్నికల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకులే సొంతపార్టీకి ద్రోహం చేశారని పోతంగల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj), మాజీ డీసీసీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పోతంగల్ మండల (Pothangal Mandal) కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Congress Leaders Party Betrayal | ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం..
బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల (Banswada Municipality Elections) నేపథ్యంలో కొంతమంది ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు బాన్సువాడలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కుమ్మక్కయ్యారని వారు ఆరోపించారు. ఎన్నికలకు ముందురోజు రాత్రి రెండు, మూడు గంటల వరకు మంతనాలు చేశారని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పన్నాగాలు చేశారన్నారు. సదరు అనుమానితులను పోలీస్స్టేషన్లో అప్పగించి విచారిస్తే తాము కాంగ్రెస్ నాయకులమేనని చెబుతున్నారన్నారు. మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో (Local Sarpanch Elections) కూడా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను గెలిపించి వారికి కండువాలు వేసి వాళ్లతో కలిసి తిరుగుతూ తాము మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నామని చెబుతున్నారని.. ఇది ఎంత వరకు సబబో వారి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మాట్లాడిన వీడియోలు సైతం తమ వద్ద ఉన్నాయని వారన్నారు.
Congress Leaders Party Betrayal | కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే..
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. బీఆర్ఎస్,బీజేపీ నాయకులతో సమావేశాలు ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నించారు. ఇకపై ఏనుగు వర్గీయులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ ఎంపీటీసీలు కేశ వీరేశం, విఠల్, సర్పంచులు శ్రీనివాసరావు, జగన్, షాజీ పటేల్, ఉపసర్పంచ్, నబి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి గంగాధర్, ఎజాజ్ ఖాన్, గంట్ల విఠల్, జుమ్మా కాన్, రాజు, దత్తు, మన్సూర్, ధనరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.