HomeతెలంగాణMedak | కాంగ్రెస్​ నాయకుడి హత్య.. ఎమ్మెల్యే మనవడి హస్తం!

Medak | కాంగ్రెస్​ నాయకుడి హత్య.. ఎమ్మెల్యే మనవడి హస్తం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medak | మెదక్​ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన మారెల్లి అనిల్‌ (35) కాంగ్రెస్​ జిల్లా ఎస్సీ కార్యదర్శి(SC Secretary)గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో ఏపీలోని ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Medak | మొదట రోడ్డు ప్రమాదం అనుకొని..

కాంగ్రెస్​ నేత అయిన అనిల్​కు పెట్రోల్​ బంక్​ కూడా ఉంది. ​సోమవారం గాంధీ భవన్​(Gandhi Bhavan)లో జరిగిన సమావేశానికి ఆయన వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం చిన్నఘనపూర్‌ సబ్​ స్టేషన్(Chinnaghanapur Sub Station)​ వద్ద చనిపోయాడు. అయితే మొదట రోడ్డు ప్రమాదంలో మరణించాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అనిల్​ బాడీలో బుల్లెట్లు ఉండటంతో హత్యగా గుర్తించారు. అనంతరం కారులో తనిఖీలు చేయగా.. నాలుగు బుల్లెట్​ కేసులు లభ్యమయ్యాయి.

Medak | హైదరాబాద్​ నుంచి వెంబడించి..

అనిల్​కు ఏపీలోని ఓ ఎమ్మెల్యే(AP MLA) మనవడితో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఓ ల్యాండ్​ సెటిల్​మెంట్లో అనిల్ రూ.కోటి డిమాండ్ చేసినట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన బెంజ్​ కారును అనిల్​ లాక్కున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం గాంధీభవన్​లో మీటింగ్​ అనంతరం ఆయన ఓ రియల్ఎస్టేట్ ఆఫీసు(Real Estae Office)కు వెళ్లి గొడవ పడ్డట్లు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్​ నుంచి అనిల్‌ను రెండు కార్లలో వెంబడిస్తూ వచ్చిన నిందితులు కాల్చి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.