74
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : DCC Nizamabad | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను (Bomma Mahesh Kumar Goud) నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం వారిని కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్లతో చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు సూచించారు. వారి వెంట నాయకులు గన్‌రాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులున్నారు.