అక్షరటుడే, వెబ్‌డెస్క్: National Herald Case | రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను కాంగ్రెస్ నేతలు ముట్టడిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఇటీవల సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై చార్జీషీట్ వేసింది. అయితే కోర్టు దానిని అనుమతించలేదు. దీంతో సోనియా, రాహుల్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసులను ముట్టడించారు. బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
National Herald Case | కరీంనగర్లో ఉద్రిక్తత
కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన కార్యాలయం ముట్టడికి వచ్చారు. నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులో విక్టరీ టు నేషనల్ హెరాల్స్, విక్టరీ టు యంగ్ ఇండియా అంటూ పోస్టర్లు పట్టుకుని బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే ముందుగానే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
National Herald Case | హైదరాబాద్‌లో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. గాంధీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్విహంచనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధర్నా చేయనున్నారు.