అక్షరటుడే, బోధన్: Bodhan | ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఇంటికి వెళ్లి రాజీనామా పత్రాలను చీఫ్‌కు అందజేశారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వారు పక్రటించారు.
