అక్షరటుడే, వెబ్డెస్క్: Congress | గజ్వేల్ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి వివేక్ (Minister Vivek) ముందే వర్గపోరు బయట పడింది. గజ్వేల్లో ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామి నూతన రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు వర్గీయులు గొడవ పడ్డారు.
ఆహ్వానించక ముందే శ్రీకాంత్ రావు అనుచరుడు మల్లారెడ్డి వేదికపైకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లకముందే ఎలా వెళ్తావని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మంత్రి వారిని సముదాయించిన వినకుండా నినాదాలు చేశారు. వేదికపైకి రావడానికి ప్రయత్నించగా పోలీసులు (Police) వారిని చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాల వారికి సర్ది చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.