అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth reddy) మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని (Nizamabad Police Commissionerate) ముట్టడించేందుకు గురువారం తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nizamabad Congress | కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపర్చే విధంగా పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కేటీఆర్‌తో పాటు ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యకు (CP Sai Chaitanya) వినతిపత్రం అందజేశామన్నారు. మాజీమంత్రి కేటీఆర్‌పై కఠినమైన సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థులు, యువత మనోభావాలను దెబ్బతీసే విధంగా కేటీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారని దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాలన్నారు. జిల్లాలో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కేటీఆర్‌పై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలోని విద్యార్థులు యువత పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్, రత్నాకర్, వేణురాజ్, విపుల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు
ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
సీపీ సాయిచైతన్యకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మానాల, గడుగు, కేశవేణు, తాహెర్ తదితరులు