ePaper
More
    HomeతెలంగాణLive Debate | టీవీ లైవ్​ డిబెట్​లో కొట్టుకున్న కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు

    Live Debate | టీవీ లైవ్​ డిబెట్​లో కొట్టుకున్న కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై బీఆర్​ఎస్​ నాయకుడు గౌతమ్​ ప్రసాద్ (BRS leader Gautam Prasad) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ​లైవ్​లోనే దవడ పగలగొట్టారు. డిబెట్​లో భాగంగా మొదట సతీష్ చేయి లేపగానే.. నాపైనే చేయి లేపుతావా.. అంటూ గౌతమ్​ ప్రసాద్​.. సతీష్​పై దాడి చేశాడు. ఈ క్రమంలో టీవీ స్టూడియోలో గందరగోళం నెలకొంది.

    Live Debate | అసలేం జరిగిందంటే..

    మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)​కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) మధ్య నెలకొన్న ఛాలెంజ్​ల నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలపై మంగళవారం సాయంత్రం యోయో టీవీలో (YOYO TV) లైవ్​ డిబెట్​ నిర్వహించింది. ఇందులో బీఆర్​ఎస్​ తరఫున గౌతమ్​ ప్రసాద్​, కాంగ్రెస్​ తరఫు నుంచి దేవని సతీష్​, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

    ఇక, డిబెట్​ స్టార్ట్ అయ్యాక.. గౌతమ్​ ప్రసాద్​ ఒక దశలో రాష్ట్రంలోని రేవంత్​ సర్కారును కడిగిపారేశారు. ఒక బాధ్యతగల అధికార హోదా పదవుల్లో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకోవడంపై నిలదీశారు. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఈ క్రమంలో అడ్డుతగిలిన సతీష్​.. గౌతమ్​ ప్రసాద్​పై చేయెత్తారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన గౌతమ్​.. నాపైనే చేయి లేపుతావా.. అంటూ సతీష్​పై దాడికి దిగారు. ఇరువురి దెబ్బలాటతో యోయో స్టూడియోలో గందరగోళం నెలకొంది. ఇక న్యూస్​ యాంకర్​ అయితే ఒక్కసారి షాక్​ అయ్యారు. ఆ తర్వాత ఇతర పార్టీల నేతలు, స్టూడియో సిబ్బంది కలగజేసుకుని, ఇరువురుని విడదీసి, గొడవను సద్దుమణిగింపజేశారు.

    Live Debate | ఎవరీ గౌతమ్​ ప్రసాద్​ అంటే..

    గౌతమ్​ ప్రసాద్​ నిజామాబాద్​ వాసులకు సుపరిచితులు. ఈయన నిజామాబాద్​ జిల్లాకు చెందినవారు. పీడీఎస్​యూ (PDSU) రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఈయన సతీమణి సత్యవతి. ఈమె కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్​యూ నాయకురాలిగా సుపరిచితురాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బయటకు వచ్చారు. సత్యవతి గతంలో గ్రాడ్యుయేషన్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

    ఇక ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్​ సీపీ YSRCP చీఫ్​ జగన్​ మోహన్​ రెడ్డి సోదరి షర్మిలా రెడ్డి.. వైఎస్సార్​ తెలంగాణ పార్టీ YSR Telangana Party స్థాపించాక గౌతమ్​ ప్రసాద్​ అందులో చేరారు. ఈ పార్టీ తరఫున బోధన్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తదుపరి బీఆర్​ఎస్​లో చేరి, ప్రస్తుతం అందులో కొనసాగుతున్నారు.

    Live Debate | సతీష్​ ఎవరంటే..

    సతీష్ మాదిగ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కైపల్లి వాసి. 1969 ఆగస్టు 10న జన్మించారు. చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలు కలిగిన సతీష్.. 1990లో తెలంగాణ దళిత దండోరాను స్థాపించారు. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) Madiga Reservation Porata Samiti (MRPS) జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 2002 నుంచి 2009 వరకు బీఆర్​ఎస్​లో కీలక పదవుల్లో కొనసాగారు.

    Live Debate | ప్రజారాజ్యం పార్టీలో..

    ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీ (PRP) లో చేరారు. అనంతరం అచంపేట పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నియమితులయ్యారు. తదుపరి 2010లో మాల, మాదిగ JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) కన్వీనర్‌గా నియమితులయ్యారు.

    Live Debate | తెలుగుదేశం పార్టీ (TDP)..

    సతీష్ 2014లో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. ఆ పార్టీ అధిష్ఠానం సతీష్​ను తెలంగాణ రాష్ట్ర అధికారిక ప్రతినిధిగా నియమించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అంటే మే 5, 2022న భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే రెండేళ్లు కూడా గడవక ముందే సతీష్​ గతేడాది మార్చిలో కాంగ్రెస్​ పార్టీలో చేరి, ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...