అక్షరటుడే, వెబ్డెస్క్ : Election Commission | కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidmbaram) ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు.
బీహార్ (Bihar)లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ఎన్నికల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కొవాలని సూచించారు.
ఎన్నికల సంఘం (ECI) మోసపూరితంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తోందని చిదంబరం ఆరోపించారు. SIR ప్రక్రియతో బీహార్లో 65 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తమిళనాడు (Tamil Nadu)లో కొత్తగా 6.5 లక్షల మంది ఓటర్లను చేర్చడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తాము తొలగించిన వారిలో 23.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28 లక్షల ఓటర్లు శాశ్వతంగా బదిలీ చేయబడినవని, 7.01 లక్షలు నకిలీ ఓటర్లుగా ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఒక వ్యక్తి వలస వెళ్లినట్లు, చనిపోయినట్లు ఎలా నిర్ణయించారని చిదంబరం ప్రశ్నించారు.