అక్షరటుడే, కామారెడ్డి: PM Kisan Scheme | పీఎం కిసాన్ పథకం(PM Kisan Scheme)లో కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ జిల్లా నాయకుడు నాగరాజ్ గౌడ్(Ankannagari Nagaraj Goud) కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గుతోందన్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. లబ్ధిదారులు చనిపోవడం, కొత్తగా రైతుల పేర్ల నమోదు చేపట్టకపోవడంతో, కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు(Farmers) ఈ పథకానికి దూరమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం కటాఫ్ తేదీని సడలించి, అర్హులైన కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు.
