అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | ఉపాధి హామీ చట్టం మార్పుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో (Party Office) గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
BJP Nizamabad | కాంగ్రెస్ మాటలను ఖండిస్తున్నాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామని వివరించారు. గత పాలకులు కేవలం తమకు అనుకూలంగా ఉన్న పనులను మాత్రమే చేసిందన్నారు. ప్రస్తుతం అలాకాకుండా గ్రామ సభ నిర్ణయం మేరకు పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి చట్టంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
BJP Nizamabad | గ్రాయ యువతకు ఉపాధి..
ప్రధానంగా గ్రామ అభివృద్ధి యువతకు ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగులు వేస్తోందని దినేస్ అన్నారు. గత పాలకులు కాంగ్రెస్ నాయకులు సీఎం సభలకు ఉపాధి హామీ చట్ట నిధులు వినియోగించడం దారుణమని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.