అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BC Bandh | బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ తన చిత్తశుద్ధి నిరూపించుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజా నరేందర్ గౌడ్ (Congress leader Raja Narender Goud) అన్నారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్ భవన్లో (Congress Bhavan) శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ (Congress party) పూర్తి మద్దతునిస్తోందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల (local body election) నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పడం బాధాకరమన్నారు.
బీసీ రిజర్వేషన్ల (BC reservations) పెంపు న్యాయమైన డిమాండ్ అని, కుట్రలు చేసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం సరికాదన్నారు. ఈనెల 18న జరిగే బంద్‌లో కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొంటారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు నాగరాజు, నిజామాబాద్ జిల్లా సేవాదళ్ మాజీ అధ్యక్షుడు డి నారాయణరావు (నాని), డిస్టిక్ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.