అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతోంది. ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ 12 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఉంది.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress and BRS) మధ్య పోరు నడిచింది. రెండు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతితో గెలుస్తామని బీఆర్ఎస్ భావించింది. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచినట్లు తెలుస్తోంది. ఐదో రౌండ్లో రహ్మత్‌నగర్, వెంగళ్రావు నగర్ డివిజన్లోని (Rahmatnagar and Vengalrao Nagar divisions) ఓట్లను లెక్కించారు. ఐదో రౌండ్లో కాంగ్రెస్ 3,178 మెజారిటీ సాధించింది.
Jubilee Hills counting | ఆది నుంచి హవా..
కౌంటంగ్‌లో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress party) లీడ్‌లో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్, తొలిరౌండ్లో స్వల్ప ఆధిక్యం సాధించిన హస్తం పార్టీ, రెండు, మూడు, నాలుగు రౌండ్లలో భారీ మెజారిటీ సాధించింది. ఇప్పటి వరకు షేక్‌పేట, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో కౌంటింగ్ పూర్తయింది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 9,147 లీడ్ సాధించారు.
పోస్టల్ బ్యాలెట్‌లో (postal votes) బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్‌కు 17,874, బీఆర్ఎస్కు 14,879, బీజేపీ 3,475 ఓట్లు సాధించింది.
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్లో 2,947, మూడో రౌండ్‌లో 2,843, నాల్గో రౌండ్‌లో 3,558 ఓట్ల ఆధిక్యత సాధించింది. ఐదో రౌండ్లో 3,178 ఓట్ల మెజారిటీ రాగా.. ప్రస్తుతం ఆ పార్టీ 12,651 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఆరో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది.
