అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడి దోపిడీ పెరిగి పోయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ జలాలను రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు (AP CM Chandrababu) అప్పగిస్తున్నారని విమర్శించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం (Damaragida Mandal) కానుకుర్తిలో గురువారం నిర్వహించిన రైతుల గ్రామసభలో కవిత మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఆ నీళ్లను ఆంధ్రకు తరలిస్తోందని విమర్శించారు. నీటి కష్టాలు ఉండొద్దనే కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు నిర్మించారని చెప్పారు. కేసీఆర్ (KCR) పాలనలో ఎండాకాలంలో చెరువులు నింపుకున్నామన్నారు.
MLC Kavitha | పాలమూరు పక్కకు..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం (Revanth Government) కావాలనే పక్కకు పెడుతోందని కవిత ఆరోపించారు. 16 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చామన్నారు. 95 శాతం పూర్తయిన ప్రాజెక్టును రేవంత్ రెడ్డి (Revanth Reddy) పక్కకు పెట్టాడని విమర్శించారు. లక్ష 85 ఎకరాలకు నీరు అందే ప్రాజెక్టు పక్కన పెట్టి, కొత్తగా కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాడన్నారు. ఇది కూడా జూరాల నుంచి కాకుండా బూత్‌పూర్ ప్రాజెక్టు నుంచి అంటున్నారని, అక్కడ మక్తల్ కే నీళ్లు సరిగ్గా రావని, ఇక్కడ దాకా ఎలా వస్తాయని కవిత ప్రశ్నించారు. కాల్వల ద్వారా కాకుండా పైవుల ద్వారా కొడంగల్‌కు (Kodangal) నీళ్లను తీసుకెళ్తామని చెబుతున్నారని, ఈ పనులు పూర్తయినా నీటి లభ్యత లేని కారణంగా ప్రయోజనం ఉండదన్నారు.
MLC Kavitha | నష్టమే ఎక్కువ..
కొడంగల్ ఎత్తిపోతల పతకం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ అని కవిత (MLC Kavitha) తెలిపారు. దీని పేరిట భారీ దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. మొదట రూ.3 వేల కోట్లు అన్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.4500 కోట్లకు పెంచారన్నారు. పెరిగిన డబ్బులు పెద్దవారి జేబులకు వెళ్తున్నాయని ఆరోపించారు. ఇద్దరు పెద్ద కాంట్రాక్టర్ల జేబులోకి ఈ 1500 కోట్లు పోయినాయని, ఒక్క పని చేయక పోయినా డబ్బులు ముట్టాయని తెలిపారు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినట్లు ఇక్కడి భూనిర్వాసితులకు కూడా ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానుకుర్తి గ్రామస్థులకు (Kanukurthi Villagers) సెపరేట్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రూ.20 లక్షల పరిహారం ఇస్తామని సీఎం చెప్పిన తర్వాత కూడా ఇక్కడ అధికారులు రూ.14 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కానుకుర్తి గ్రామ ప్రజల పక్షాన తాను పోరాడతానని చెప్పారు.