అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-elections) కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15,589 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.
ఆరో రౌండ్‌లో నవీన్‌యాదవ్‌కు చెందిన యూసుఫ్‌గూడ ఓట్లను (Yusufguda votes) కౌంట్ చేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ లీడ్ సాధించింది. షేక్‌పేట, రహ్మత్‌నగర్, వెంగళ్రావు నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ సాధిస్తుండడం గమనార్హం. పది రౌండ్లలో మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైనల్ రిజల్ట్ తేలనుంది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,938 ఓట్ల మెజారిటీ వచ్చింది.
Jubilee Hills counting | రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు..
కౌంటంగ్‌లో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ (postal ballot), తొలిరౌండ్లో స్వల్ప ఆధిక్యం సాధించిన హస్తం పార్టీ, రెండు, మూడు, నాలుగు, ఐదో రౌండ్లలో భారీ మెజారిటీ సాధించింది. పోస్టల్ బ్యాలెట్‌లో బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి.
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ 38,566 ఓట్లు, మాగంటి సునీత 29,007, దీపక్ రెడ్డి 7,296 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,947, మూడో రౌండ్‌లో 2,843, నాలుగో రౌండ్‌లో 3,558 ఐదో రౌండ్‌లో 3,178, ఆరో రౌండ్‌లో 2,938 ఓట్ల మెజారిటీ సాధించింది. మొదటి రౌండ్‌లో కాస్తా పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ తర్వాత వెనకబడిపోయింది. ఇక బీజేపీ చాలా దూరంలో ఉండిపోయింది. మరోవైపు గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
