HomeతెలంగాణKCR | తెలంగాణకు నంబర్ వన్ విలన్​ కాంగ్రెస్​: వరంగల్ సభలో కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KCR | తెలంగాణకు నంబర్ వన్ విలన్​ కాంగ్రెస్​: వరంగల్ సభలో కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | తెలంగాణకు నంబర్​ వన్​ విలన్​ కాంగ్రెస్​ అని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ Brs chief Kcr అన్నారు. వరంగల్​ సమీపంలోని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో Brs silver jubilee celebration ఆయన మాట్లాడారు. ముందుగా కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళి అర్పించిన అనంతరం సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు స్వాగత ఉపన్యాసం చేశారు. అనంతరం గులాబీ బాస్​ కేసీఆర్​ మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ఏడాదిన్నరలో చేసిందేమి లేదన్నారు. అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్​ను మించిన వారు లేరన్నారు. అబద్దపు హామీలు ఇవ్వడానికి డూప్లికేట్​ గాంధీలు ఢిల్లీ నుంచి వచ్చారని ఎద్దేవా చేశారు.

KCR | పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం..

25 ఏళ్ల క్రితం తాను తెలంగాణలో ఉన్న అనేక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ ఏర్పాటు చేశానన్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయినా కూడా ప్రజాభిమానంతో గులాబీ జెండా రెపరెపలాడుతూ.. తెలంగాణ సాధించామని చెప్పారు. అనంతరం పదేళ్ల పాటు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్​ వన్​ చేశామన్నారు.

KCR | ప్రాజెక్ట్​లు పూర్తి చేశాం..

తమ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.90 వేల నుంచి రూ.3.5లక్షలకు పెంచామన్నారు. జీఎస్​డీపీ సైతం పెరిగిందన్నారు. ఎన్నో ప్రాజెక్ట్​లను నిర్మించి రైతులకు సాగు నీరు అందించామన్నారు. చెక్​డ్యామ్​లు నిర్మించామని, మిషన్​ కాకతీయ కింద చెరువులు బాగు చేయడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించామన్నారు.

KCR | రైతు సంక్షేమం కోసం పాటుపడ్డాం

తమ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం former welfare schemes కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కేసీఆర్​ తెలిపారు. తనను ఎవరు అడగకున్నా.. రైతు బంధు raithu bandhu అమలు చేశామని చెప్పారు. సీజన్​ ప్రారంభం కాగానే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేవని చెప్పారు. అలాగే రైతుబీమా అమలు చేసి, రైతులు చనిపోతే వారి కుటుంబానికి రూ.ఐదు లక్షలు అందజేశామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు.

KCR | హామీల అమలు ఎక్కడా..?

అధికారంలోకి వస్తే పింఛన్లు, రైతు బంధు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్​ ఇప్పుడు అమలు చేసిందా..? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు స్కూటీలు, ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని చెప్పారని, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో హామీలు ఇచ్చి.. అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. దేవుళ్ల మీద ఓట్లు పెట్టడం తప్పా కాంగ్రెస్​ చేసిందేమీ లేదన్నారు. తాము ఉచితంగా నాణ్యమైన కరెంట్​ ఇచ్చామని.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్​ ప్రశ్నించారు.

KCR | ఉచిత బస్సుతో ఉపయోగం లేదు

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి పెట్టిన ఉచిత బస్సు పథకంతో ఉపయోగం లేదన్నారు. దాంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవడం తప్పా చేసిందేమి లేదన్నారు. ఆ పథకం వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్​ అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితిని ఆగం చేసిందన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో తెలంగాణలో భూముల ధరలు అధికంగా ఉండేవని.. నేడు ధరలు పడిపోయాయని ఆయన పేర్కొన్నారు.

KCR | ఇన్నాళ్లు అందుకే బయటకు రాలేదు

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక హైడ్రా hydraa పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్​కు సమయం ఇవ్వడానికే తాను ఇన్ని రోజులు బయటకు రాలేదని కేసీఆర్​ అన్నారు. ఏడాదిన్నర అయిపోయిందని, ఇంకెప్పుడు పనులు చేస్తారన్నారు. ఈ రోజు హెచ్​సీయూ భూములు Hcu Lands అమ్ముతున్న కాంగ్రెస్​.. రేపు ఉస్మానియ భూములు ou lands కూడా అమ్ముతుందన్నారు. రాష్ట్రాన్ని నడపడం చేతగాని కాంగ్రెస్​ నాయకులు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే భూముల రేట్లు తగ్గాయని ధ్వజమెత్తారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా తీసిందని, భూములు అమ్ముదామన్నా.. కొనేవారు లేరని ఆయన వ్యాఖ్యానించారు.