అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో బాంబులు పడుతుంటే ఇక్కడ వారు ఆందోళన చెందారని ఆరోపించారు. బీహార్‌లోని ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఆర్జేడీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. జంగల్‌రాజ్‌ను బిహార్ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చూస్తారని పేర్కొన్నారు.
PM Modi | కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి..
ఆర్జేడీ తుపాకీతో గురిపెట్టి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కుందని మోదీ ఆరోపించారు. ఈ కూటమిని “విభజిత ఇల్లు”గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ డిమాండ్లను మేనిఫెస్టోలో (manifesto) విస్మరించారని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని మోదీ అన్నారు. అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఎన్డీఏతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో (RJD and Congress alliance) అంతర్గత కలహాలు ఉన్నాయని ఎత్తి చూపారు.
PM Modi | క్షమాపణ చెప్పలేదు
ఢిల్లీలో 1984లో ఇదే సమయంలో సిక్కులను ఊచకోత కోశారని ప్రధాని మోదీ అన్నారు. ఈ మారణహోమం విషయంలో కాంగ్రెస్ ఇంకా క్షమాపణ చెప్పలేదన్నారు. దోషులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాగా ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్య అనంతరం ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చాలా మంది సిక్కులను హత్య చేశారు. దీనిగురించి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. పెద్ద వృక్షం కూలితే ప్రకంపనలు సహజం అన్నారు. కాగా.. దీనిపై తాజాగా మోదీ మాట్లాడారు. చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారని మోదీ విమర్శించారు. వారిని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు.
