అక్షరటుడే, వెబ్డెస్క్ : Two Lakh Jobs | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మరో గ్యారంటీ నుంచి సీఎం రేవంత్రెడ్డి ముఖం చాటేశారన్నారు.
అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఇటీవల పీసీసీ అధ్యక్షుడు (PCC President) మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఐదేళ్లలో నెరవేరుస్తామన్నారు. ఆయన వ్యాఖ్యలపై కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ (Delhi) నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని విమర్శించారు.
Two Lakh Jobs | కేసీఆర్ నోటిఫికేషన్లతో..
కేసీఆర్ (KCR) హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఫొటోలకు ఫోజులు ఇచ్చారని విమర్శించారు. ఆ తర్వాత నోటిఫికేషన్లు వేయడం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి దాని గురించి కనీసం ప్రకటన చేయడం లేదన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. మెగా డీఎస్సీ (Mega DSC), నిరుద్యోగ భృతి పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.
Two Lakh Jobs | రైతుబంధు ఏది
ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం యాసంగి సీజన్ సగం గడిచినా ప్రభుత్వం ఇంకా రైతు భరోసా (Rythu Bharosa) విడుదల చేయడం లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.